![]() |
![]() |
.webp)
ధనసరి సీతక్క గురించి ఎవరికీ చెప్పక్కర్లేదు. చాలా ఇన్స్పిరేషనల్ విమెన్ . అంటే ఎంత తక్కువగా మాట్లాడి ఎంత ఎక్కువ పని చేయాలి అనేది ఈమెకు తెలిసినంత ఇంకెవరికీ తెలీదు. ఆదివాసీ కోయ జాతికి చెందిన ఈమె రెండు తెలుగు రాష్టాల్ర ప్రజలకు సుపరిచితమే. తెలంగాణ రాజకీయాల్లో సీతక్కది ప్రత్యేక స్థానం. విద్యార్థి దశ నుంచే పోరాటం మొదలుపెట్టి దళంలో చేరి అన్నలతో కలిసి ప్రభుత్వం మీద పోరాటం చేసిన ధీశాలి. ఐతే తర్వాతి కాలంలో అక్కడ మారిన సిద్దాంతాలు పొసగక బయటికి వచ్చేసి రాజకీయాల్లో చేరారు. 15ఏళ్లకుపైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం చేసిన మాజీ నక్సలైటు సీతక్క.. ఇప్పుడు తెలంగాణ మంత్రివర్గంలో చోటుదక్కించుకున్నారు. అలాంటి సీతక్క పుట్టిన రోజునాడు రచ్చ రవి విషెస్ చెప్పాడు. సీతక్క దగ్గరకు వెళ్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. "బంగారు మనసున్న మా అక్క మంత్రివర్యులు సీతక్కకు జనం దిన్ ముబారక్ ..సౌవ్ సాల్ చల్లగా బతుకు అక్క" అంటూ సీతక్కతో దిగిన ఫొటోస్ ని కూడా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. బుల్లితెర మీద రచ్చ రవిది డిఫరెంట్ స్టైల్. ఎవరి పుట్టినరోజు ఐనా కూడా వెళ్లి వాళ్లకు విషెస్ చెప్తాడు. అలాగే వాళ్ళతో ఉన్న ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేస్తాడు. అంటే ఈ రోజుల్లో ఎవరూ పుట్టినరోజులు వంటివి అసలు పట్టించుకోవడమే లేదు. కానీ రచ్చ రవి మాత్రం అందరి పుట్టినరోజులు తెలుసుకుని కచ్చితంగా వాళ్లకు విషెస్ చెప్పడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు.
![]() |
![]() |